
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎల్ 2: ఎంపురాన్’. గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా గురువారం (మార్చి 27) న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంపురాన్ సినిమాను విడుదల చేయనుండడం విశేషం. కాగా ఈ సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలే ఉండగా చిత్ర బృందం ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎంపురాన్ చిత్రం నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఆ షాడో పోస్టర్ లో ఉన్నది ఎవరా? అని సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కూడా నటించారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా విడుదలైన ఎంపురాన్ పోస్టర్ లో ఉన్నది అమీరేనని కొందరు బల్ల గుద్ది చెబుతన్నారు. దీనిపై ఒక అభిమాని స్పందిస్తూ.. ‘ఈ ఫోటోలో ఉన్నది అమీర్ ఖానే.. కావాలంటే అతని చెవులు చూడండి అచ్చం అలానే ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు. ‘అవును ఆ పోస్టర్లో ఉన్నది కచ్చితంగా అమీర్ ఖానే.. ఎందుకంటే ఆయన సోదరి కూడా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే ఈ పోస్టర్ లో ఉన్నది హాలీవుడ్ హీరో రిక్ యూన్ అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఇదే విషయమై ఒక నెటిజన్ ఏఐ గ్రోక్ ను కూడా అడిగాడు. ‘ ఈ పోస్టర్లో డ్రాగన్‌కి ఎదురుగా ఉన్న సూట్లో వెనుక నుంచి ఒక వ్యక్తి కనిపిస్తాడు.. అది బహుశా మోహన్‌లాల్ అయి ఉండొచ్చు. ముఖం కనిపించకుండా ఉన్న ఈ పోస్టర్‌కు రిక్ యున్‌తో పెద్దగా పోలిక లేదు. ఈ శైలి యున్ యాక్షన్ పాత్రలను సరిపోలినప్పటికీ.. కానీ భౌతికంగా చూస్తే ఆ పోలిక అస్పష్టంగా ఉంది అని గ్రోక్ ఆన్సర్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
2 days to go! #L2E #EMPURAAN In theatres worldwide from 27/03/25.
BMS – https://t.co/N8VWfpo2bn
Paytm – https://t.co/Fjlf0z8Vtv
District – https://t.co/y1UCD4nLGV
Ticketnew – https://t.co/wvQGWTXGxa#March27 @mohanlal #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan… pic.twitter.com/XxRkMHNgr5— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 24, 2025
మొత్తానికి ఎంపురాన్ మూవీ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో ఉన్న మిస్టరీ మ్యాన్ ఎవరో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.