
సాయి పల్లవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బంధువు పెళ్లి వేడుకకు హాజరైంది.
సాయి పల్లవితో పాటు ఆమె సోదరి పూజా కన్నన్ కూడా ఈ పెళ్లి వేడుకలో తళుక్కుమంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఇక నీలి రంగు చీరలో సాయిపల్లవి ఈ వివాహ వేడుకకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక చెల్లి పూజా కన్నాన్ కూడా అక్కని మించిపోయే అందంతో కనిపించింది.
ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుంది.
రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.