
పాములు, పైథాన్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు సైతం ఎంతో ఆసక్తిగా ఉంటున్నారు. ఈ సమయంలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో, ఒక మహిళ నిద్రలోంచి మేల్కొన్న వెంటనే తనకు ఎదురైన సీన్ చూసి ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. అప్పుడే నిద్రలేచిన ఆమె.. తన పక్కనే ఉన్న మరోకరిని చూసి ఒకింత భయంతో వణికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ తన మంచం మీద నిద్రపోతోంది. నిద్రలోంచి మేల్కోన్న ఆమె కళ్ళు తెరిచి చూడగానే తన పక్కన ఒక పెద్ద కొండచిలువ ఆమెపై పాకుతూ కనిపించింది. అప్పుడే కళ్లు తెరిచిన ఆమె కొండచిలువను చూసి చాలా భయపడుతుంది. గట్టిగా అరవడం మొదలుపెట్టింది. భయంతో ఆమెకు పై ప్రాణాలు పైకే పోయినంత పనైంది. కానీ, ఆ భయంకర కొండ చిలువ మాత్రం ఆమె దాడి చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఆమె నుండి దూరంగా వెళ్లిపోతుంది. అవకాశం రాగానే ఆమె వెంటనే మంచం మీద నుండి లేచి పారిపోతుంది.
ఈ భయానక వీడియోను X లో ‘AMAZlNGNATURE’ హ్యాండిల్‌తో ఉన్న పేజీ షేర్ చేసింది. పోస్ట్ షేర్ చేసిన తర్వాత, ఈ వీడియోను ఇప్పటివరకు 897K మంది వీక్షించారు. ఈ వీడియోపై ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబోయ్ ఆమెకు ఈ భూమిపై ఇంకా నూకలు మిగిలే ఉన్నాయంటూ కూడా కొందరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..