
సొంతం సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ మూవీ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈసినిమాలో ఆర్యన్ రాజేష్ హీరోగా.. నమిత కథానాయిగా నటించింది. ఇక ఇందులో మరో హీరో రోహిత్ సైతం కీలకపాత్రలో కనిపించగా.. అందరి కంటే ఎక్కువగా అడియన్స్ దృష్టిని ఆకర్షించింది మరో అమ్మాయి. తనే నేహా పెండ్సే. ఈ చిత్రంలో సౌమ్య అనే అమాయకమైన అమ్మాయిగా కనిపించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చేసింది. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యింది.
ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో నేహా వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. తెలుగుతోపాటు మరాఠీ, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో.. సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. బిగ్ బాస్ సీజన్ 12లో పాల్గొంది. అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్, షోలలో కనిపించింది. సినిమాలతోపాటు అటు ప్రకటనలలోనూ కనిపించింది.
ఇవి కూడా చదవండి
2020లో వ్యాపారవేత్త శార్దూల్ సింగ్ బియాస్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే నేహా పెళ్లి చేసుకోవడానికి ముందే శార్దుల్ రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. అంతేకాదు అతడికి ఇద్దరు అమ్మాయిలు సైతం ఉన్నారు. నేహా భర్త శార్దూల్ దాదాపు 22 కంపెనీలకు యజమాని. మొత్తం 125 డాలర్ల ఆస్తి కలిగి ఉన్నాడు. అంటే దాదాపు పదిన్నర వేల కోట్లకు పైగా ఉంటుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..