
పాము..ఈ పేరు వినగానే చాలా మంది భయంతో పారిపోతుంటారు. పాము కనపడగానే క్షణాల్లో అక్కడ్నుంచి దూరంగా పరిగెడతారు. ఇకపోతే, సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం అనేకం వైరల్ అవుతుంటాయి. పాములు అంటే భయం ఉన్నవాళ్లు సైతం ఆ వీడియోలను చాలా ఇంట్రెస్ట్‌తో చూస్తారు. తాజాగా ఒక పాము వీడియో ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది. అందులో ఒక పాము ఎండ వేడిమి తట్టుకోలేక ఏం చేసిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియోలో ఒక పాము ఎండ నుండి తప్పించుకోవడానికి ఏం చేసిందో చూస్తే మీరు అవాక్కవుతారు. వేసవితాపంతో అల్లాడిపోయిన ఆ పాము..ఒక హ్యండ్ బోర్ వద్దకు చేరుకుంది. అక్కడ బోర్ కింద కూర్చుంటుంది. తన పడగ మీద నీళ్లను పడేలా చూసుకుంటుంది..కాసేపు అలాగే ఉంటుంది..అంతలోనే అక్కడికి ఎవరో వచ్చిన అలజడి వింటుంది. ఆ పాము.. దాంతో పక్కకు జరిగింది.. కానీ, అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కర్ర సాయంతో పాము పడగను అటు ఇటూ కదిపుతూ నీటి పంపు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది పాము ఎండ వేడికి సేదతీరుతున్న వీడియో చూసి షాక్ అవుతున్నారు. పాపం..పాము కూడా ఒక ప్రాణి కదా.. దాని ప్రయత్నం అది చేస్తుందంటూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..