
సినిమాల్లోకి రాక ముందే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సురేఖా వాణి కూతురు సుప్రిత. తన ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, రీల్స్ తో గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనిని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేలా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది సుప్రిత. బిగ్‌బాస్ తెలుగు సీజన్ -7 రన్నరప్ అమర్దీప్ చౌదరితో కలిసి ఓ సినిమా చేస్తోందీ అందాల తార. వీటన్నటినీ పక్కన పెడితే.. హోలీ పండగ రోజున తన ఫాలోవర్లను ఉద్దేశించి ఒక వీడియోను రిలీజ్ చేసింది సుప్రిత. తెలిసో తెలియకో తాను కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని అందులో చెప్పుకొచ్చింది. ఇకపై వాటికి దూరంగా ఉంటానని, దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
లోకల్ బాయ్ నాని, సన్నీ యాదవ్, హర్ష సాయి వంటి ఫేమస్ యూట్యూబర్లపై కేసులు కూడా నమోదయ్యాయి. వీరితో పాటు పలువురు సినీ తారలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో సుప్రీత, టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూచౌదరి తదితర సెలబ్రిటీల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా తనపై వస్తున్న వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా మరో వీడియోను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలోనూ, టీవీలోనూ తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొవద్దని రిక్వెస్ట్ చేసింది. ‘హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్‌లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలే. దయచేసి ఎవరూ వాటిని నమ్మోద్దు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఒక సినిమా షూటింగ్లో ఉన్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది సుప్రిత.
ఇవి కూడా చదవండి
సుప్రిత రిలీజ్ చేసిన వీడియో..
thanks for all your support ❤️ pic.twitter.com/b55xZpgUW1
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) March 17, 2025
హోలీ పండగ రోజున..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..