
సినీరంగంలో ఎక్కువగా చర్చించబడుతున్న ప్రేమకథలలో ఈ స్టార్ హీరోహీరోయిన్ లవ్ స్టోరీ కూడా ఒకటి. నటన ప్రపంచంలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి.. కొన్నాళ్ల క్రితమే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు అందమైన అమ్మాయి జన్మించింది. ప్రస్తుతం వీరిద్దరు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే ఆ హీరో కంటే ముందే.. హీరోయిన్ తనకు 11 ఏళ్లు వయసులోనే అతడిని చూసి ప్రేమలో పడింది. ఆమె ప్రేమ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంటుంది. సౌత్ టూ నార్త్ వరకు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకీ ఈ క్యూట్ కపూల్ మరెవరో కాదు.. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్.
అలియా భట్ మార్చి 15, 1993న ముంబైలో జన్మించింది. డైరెక్టర్ మహేష్ భట్ కుమార్తెగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్నప్పటి నుంచీ నటనా రంగంలో కెరీర్‌ను కొనసాగించాలని నిశ్చయించుకుంది. కేవలం ఆరు సంవత్సరాల వయసులోనే, ‘సంఘర్ష్’ చిత్రంలో ప్రీతి జింటా చిన్నప్పటి పాత్రను పోషఇంచింది. ఆ తర్వాత స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిందీలో ‘హైవే’, ‘2 స్టేట్స్’, ‘హంప్టీ శర్మ కీ దుల్హానియా’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. గంగూబాయి కతియావాడి సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.
ఆమె కేవలం 11 సంవత్సరాల వయసులో మొదటిసారి ప్రేమలో పడింది. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘బ్లాక్’ సెట్స్‌లో ఆలియా తొలిసారి రణ్‌బీర్ కపూర్‌ను కలిసింది. ఆ సమయంలో రణ్‌బీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడే అతడిని ప్రేమించడం స్టార్ట్ చేసింది. చిన్న వయసులోనే ఆమె రణబీర్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత బర్ఫీ సినిమా చూసినప్పుడు రణబీర్ పై మరింత ఇష్టం పెరిగింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఏప్రిల్ 14, 2022న, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..