
సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నారు టాలీవుడ్ హీరో మహేష్ బాబు. గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడీ రియల్ హీరో. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు మహేష్ బాబు. అలా ఇప్పటి వరకు 4500 లకు పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేపించాడు మహేష్. ఈ విషయాన్ని విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మహేష్ సతీమణి నమత్రా శిరోద్కర్ హాజరైంది. ఈ సందర్భంగానే మదర్స్ మిల్క్ బ్యాంక్ తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రత ప్రారంభించింది. అనంతరం ఆస్పత్రిలో గుండె సర్జరీ చేయించుకున్న చిన్నారులతో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మహేష్- నమ్రత దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు నిజంగా దేవుడివి సామి అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
తనయుడు గౌతమ్ కు ఆ సమస్య తలెత్తడంతో..
ఇవి కూడా చదవండి
కాగా మహేష్ తనయుడు గౌతమ్ కు చిన్న నతనంలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పుడు వారి దగ్గర సరిపడ డబ్బులు ఉండడంతో వెంటనే సర్జరీ చేయించారు. అప్పటి నుంచే మహేష్ మదిలో ఉచిత హార్ట్ ఆపరేపన్స్ ఆలోచన మొదలైంది. ‘గౌతమ్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది.. మరి లేని వారి పరిస్థితి ఏంటి’ అంటూ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మహేష్. అలా ఇప్పటివరకు 4500+ చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి రియల్ హీరోగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
ఆంధ్రా హాస్పిటల్స్ లో మహేష్ సతీమని నమ్రత.. వీడియో..
Heartfelt Gratitude 🤍
Thank you Namrata Shirodkar garu & @andhrahospital1 , for transforming lives!
Supporting little fighters in the Pediatric Cardiac ICU,
Launching the Mother’s Milk Bank,
Empowering young girls through HPV Vaccination#ThankYouNamrataMaam#MBForSavingHearts pic.twitter.com/49j4kBGcvL— Mahesh Babu Foundation (@MBfoundationorg) March 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి