
వరంగల్ లో కిలాడి లేడీ హైటెక్ సెక్స్ రాకెట్ బాగోతం బట్టబయలైంది. పోలీసుల అప్రమత్తతతో మైనర్ బాలికల అక్రమ రవాణా, సెక్స్ రాకెట్, గంజాయి మత్తు గుట్టు రట్టయింది. ఇన్స్టాగ్రాం వేదికగా అమాయక బాలికల జీవితాలతో చెలగాటం ఆడుకున్న ఆ కిలాడీ, ఓ మైనర్ బాలికను ఎరగా వేసి అమాయక బాలికల జీవితాలు బుగ్గిపాలు చేసింది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక కిడ్నాప్ వ్యవహారంతో అసలు బాగోతం బయటపడింది. మాయలేడీతోపాటు, మైనర్ బాలిక, నలుగురు పోకిరీలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 4,300 కండోమ్స్ లభ్యమవడం పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది.
వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 11వ తేదీన ఓ మైనర్ బాలిక మిస్సయింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు, ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు అవాక్కయ్యే ఘోరాలు బయటపడ్డాయి. మైనర్ బాలికలు, ధనవంతులైన మహిళలను టార్గెట్గా చేసుకుని ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేస్తున్న ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వాళ్ళ వలలో చిక్కుకుని ఎంతో మంది బలయ్యారు. మైనర్ బాలికలకు గంజాయి, డ్రగ్స్ ఇచ్చి హత్యాచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. వారిని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మైనర్ బాలికలు, ఇన్స్టాగ్రామ్ మోజులో ఆరాటపడే మహిళలే వీరి టార్గెట్. వారిని సెలెక్ట్ చేసుకుని మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయాలు పెంచుకుని వ్యభిచార రొంపిలోకి లాగుతున్న ఓ కిలాడీ లేడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని ఆ మాయలేడీ చేసిన అరాచకాలు పోలీసులకే షాక్ ఇచ్చాయి. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఈ మహిళతో పాటు మరో నలుగురుని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపర్చారు..
వరంగల్ సీపీ తెలిపిన వివారాల ప్రకారం మార్చి 11వ తేదీన తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ లో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి.. వారిపై అత్యాచారాలు జరిపినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు షాక్ గురై డిప్గా విచారణ చేయగా ఆ కిలాడీ లేడితోపాటు మరో మైనర్ బాలిక, మరో నలుగురి పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తమదైనశైలిలో విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామానికి చెందిన ముస్కు లత అనే మహిళ తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికను చేరదీసి వ్యభిచారంలోకి దించింది. ఆ మైనర్ తో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతర మైనర్ బాలికలు, మహిళలకు గాలం వేసే పనిలో పడింది. వారిలో వలలో చిక్కిన వారిని గంజాయి మత్తుకు బానిసలుగా మార్చి వారి చేత వ్యభిచారం చేయించినట్లు పోలీసులు గుర్తించారు. వారితో ఉన్న న్యూడ్ వీడియోలు సెల్ ఫోన్లలో చిత్రీకరించి వారిని వ్యభిచార రొంపిలోకి దింపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇలా ట్రాప్ చేసిన బాలికలు, మహిళలకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళుతుంది. వారికి మత్తు పదార్థాలు ఇచ్చి.. అప్పటికే తన గ్యాంగ్ కు టచ్లో ఉన్న యువకులతో ఆ అమ్మాయిలను ఎరగా వేస్తూ, వచ్చే డబ్బులను ఎంజాయ్ చేస్తూ నిత్యం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నట్లు వరంగ్ సీపీ తెలిపారు.
అయితే కిలాడీ లేడీకి డబ్బు ఇచ్చే మానవ మృగాలు.. బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేస్తున్నారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. అంతేకాదు వారిని వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా నుండి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడి చాలామంది జీవితాలను నాశనం చేసినట్లు వరంగల్ పోలీసులు తెలిపారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విచారణలో అసలు బాగోతం బయటపడింది.
కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు బయటపడటంతో ముస్క లత, ఓ మైనర్ బాలిక తో పాటు అబ్దుల్ అఫ్నాన్, షేక్ శైలాని బాబా, ఎండీ అల్తాఫ్, మీర్జా షహీద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు వరంగల్ పోలీసులు. వారి నుంచి 2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాే వారి వద్ద 4300 కండోమ్స్ లభ్యం కావడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. వీరికి తగిన శిక్ష పడేలా చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు ఆలోచించాలని పోలీసులు సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..