
మంచి ఫ్రేమ్ లెస్ డిజైన్, హెచ్ డీ రెడీ రిజల్యూషన్ తో రూపొందించిన ఏసర్ అడ్వాన్స్ డ్ ఎన్ సిరీస్ స్టాండర్డ్ ఎల్ఈడీ టీవీతో మంచి వీక్షణ అనుభవం పొందవచ్చు. క్రిస్టల్ క్లియర్ విజువల్స్, 178 డిగ్రీల వీక్షణ కోణంతో ఏమూల నుంచి అయినా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ప్లస్ గ్రేడ్ వీఏ ప్యానల్, డైనమిక్ కాంట్రాస్ట్, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు కలిగిన ఈ టీవీ పర్సనల్ కంప్యూటర్లు, గేమింగ్ కన్సోళ్లు, సెట్ టాప్ బాక్స్ లకు సులభంగా కనెక్ట్ అవుతుంది. 24 డబ్ల్యూ హై ఫిడిలిటి స్పీకర్ల నుంచి వర్చువల్ సరౌండ్ సౌండ్ తో మంచి ఆడియోను విడుదల చేస్తాయి. అమెజాన్ కేవలం రూ.8,499కి ఏసర్ ఎల్ఈడీ టీవీ అందుబాటులో ఉంది.
ప్రముఖ కంపెనీ ఎల్ జీ నుంచి విడుదలైన 32 అంగుళాల హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. యాక్టివ్ హెచ్ డీఆర్ తో కూడిన హెచ్ డీ రెడీ డిస్ ప్లే ద్వారా విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలోని వెబోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లను యాక్సెస్ చేయవచ్చు. వైఫై కనెక్టివిటీతో అంతరాయం లేని వినోదం పొందవచ్చు. 2 హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్ బీ పోర్టుల ద్వారా గేమింగ్ కన్సోల్స్, బాహ్య పరికరాలను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. మెరుగైన పనితీరు కోసం ఎల్ జీ గ్రాఫిక్ ప్రాసెసర్, ఆధునిక ప్లాట్ స్క్రీన్ లుక్ గల ఎల్ఈడీ ప్యానెల్ దీని ప్రత్యేకతలు. అమెజాన్ లో ఈ టీవీని రూ.13,990కి కొనుగోలు చేయవచ్చు.
ఎంఐ నుంచి విడుదలైన 32 అంగళాల హెచ్ డీ రెడీ స్మార్ట్ గూగుల్ ఎల్ఈడీ టీవీలో స్మార్ట్ టెక్నాలజీ ఆకట్టుకుంటోంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్, మంచి రిఫ్రెష్ రేటుతో విజువల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. దీనిలోని డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్ ఎక్స్, 20 డబ్ల్యూ అవుట్ పుట్ తో క్రిస్టల్ క్లియర్ సౌండ్ వెలువడుతుంది. డ్యూయల్ బ్రాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, రెండు హెచ్ డీఎంఐ పోర్టులు, 2 యూఎస్ బీ పోర్టులు, ఈథర్నెట్ తో కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సొగసైన డిజైన్ తో లభించే ఈ టీవీని గోడకు, టేబుల్ పైనా అమర్చుకోవచ్చు. అమెజాన్ లో రూ.13,499కి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
సామ్సంగ్ 32 అంగుళాల హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీతో అన్ని కార్యక్రమాలను చక్కగా వీక్షించవచ్చు. పర్ కలర్, మెగా కాంట్రాస్ట్ తో చిత్రం నాణ్యత చాాలా బాగుంటుంది. స్ట్రీమింగ్ తో పాటు గేమింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. స్క్రీన్ షేర్, మ్యూజిక్ సిస్టమ్, కంటెంట్ గైడ్ వంటి స్మార్ట్ టీవీ ఫీచర్లు, నెట్ ఫిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో తదితర యాప్ లకు యాక్సెస్ లభిస్తుంది. 20 డబ్ల్యూ డాల్బీ డిజిటల్ ప్లస్ స్పీకర్ల నుంచి ఆడియో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కనెక్టివిటీ కోసం 2 హెచ్ డీఎంఐ, ఒక యూఎస్ బీ పోర్టు, వైఫై, ఈథర్నెట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ టీవీని అమెజాన్ లో రూ.14,990కి కొనుగోలు చేయవచ్చు.
ఇంటికి అందాన్నిచ్చే టీవీలలో టీసీఎల్ మెటాలిక్ బెజెల్ లెస్ ఎస్ సిరీస్ ఫుల్ హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ముందుంటుంది. హెచ్ డీఆర్ 10, ఏఐపీక్యూ ఇంజిన్, అత్యుత్తమ కాంట్రాస్ట్, మైక్రో డిమ్మింగ్ తో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్నిర్మిత వైఫై, బ్లూటూత్, నెట్ ఫిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, 24 డబ్ల్యూ డాల్బీ ఆడియో సిస్టమ్ సినిమాటిక్ సౌండ్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 బిడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనితీరు బాగుంటుంది. అమెజాన్ లో రూ.13,990కి ఈ టీవీ అందుబాటులో ఉంది.