
నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ముఖ ద్వారం వద్ద నిన్న రాత్రి11 గంటలకు ఎలుగుబంటి హల్చల్ చేసింది. శ్రీశైలంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖద్వారం కూడలి వద్ద ఎలుగుబంటు అటూ ఇటూ తిరుగుతూ శ్రీశైలానికి వచ్చే వాహనాలకు అంతరాయంగా మారింది. రోడ్డు పై నడుస్తున్న ఎలుగుబంటిను చూసిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భక్తులు తమ సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోనికి వచ్చింది ఎలుగుబంటి చూసిన భక్తులు నివ్వెర పోయారు.
అయితే నెమ్మదిగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదివరకు కూడ ఈ ఎలుగుబంటు పలుసార్లు భక్తులకు తారాసపడుతూనే ఉంది. నల్లమల అటవీ ప్రాంతమంతా వన్య మృగాలు తిరిగే ప్రాంతం కాబట్టి భక్తులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాహనాలు నడపాలని జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి