
మార్చి నుండి ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుంటాయి. ఈ మూడు నెలల పాటు ఎండలు దంచికొడుతుంటాయి. వేడి వాతావరణం చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వేసవిలో సూర్యకాంతి, కాలుష్యం, అధిక చెమట కారణంగా చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండలో చర్మం నీరసంగా, నల్లగా మారుతుంది. ఈ సీజన్లో చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయి. మొటిమల సమస్యల నుండి బయటపడటానికి మీరు ఐస్ డిప్ థెరపీని ఉపయోగించవచ్చు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మెరిసే, మచ్చలు లేని చర్మానికి ఐస్ డిప్ చికిత్స చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఐస్ డిప్ ట్రీట్మెంట్ ను కొరియన్ మహిళలు, బాలీవుడ్ తారలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఐస్ డిప్ చికిత్స జిడ్డు చర్మానికి చికిత్స చేస్తుంది. ఓపెన్ రంధ్రాల సమస్య నుండి ఉపశమనం అందిస్తుంది. అయితే, ఈ ఐస్ డిప్ థెరపీ కోసం ముందుగా ఒక పెద్ద కంటైనర్‌లో ఐస్ క్యూబ్‌లను తీసుకోవాలి.. ఈ ఐస్ క్యూబ్ కు సరిపడా నీటిని పోసుకోవాలి. ఇప్పుడు మీ ముఖాన్ని ఆ పాత్రలో ముంచాలి. ముఖాన్ని కొద్దిసేపు ఆ చల్లటి నీటిలోనే ముంచి బయటకు తీయండి. కొంత సమయం తర్వాత
మళ్లీ ఇదే ప్రక్రియ కొనసాగించండి..దీనినే ఐస్ డిప్ చికిత్స అంటారు.
ఐస్ డిప్ ట్రీట్మెంట్తో ముఖం, కళ్ళ చుట్టూ వాపును తగ్గిస్తుంది. కళ్ళ చుట్టూ వాపు ఉన్నవారి ఈ ట్రీట్మెంట్తో మంచి ఉపశమనం లభిస్తుంది. మీ ముఖాన్ని ఇలా ఐస్ వాటర్‌లో ముంచడం వల్ల మీ ముఖంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మీ ముఖానికి మెరుపును తెస్తుంది. ఐస్ డిప్ ముఖంపై ఉన్న ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం ముడతలు తగ్గుతాయి. ఐస్ డిప్ మొటిమల సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని బ్యూటిషీయన్లు చెబుతున్నారు. ఫలితంగా.. చర్మం నునుపుగా మారుతుందని, మురికి, నూనె పేరుకుపోవడం తగ్గుతుందంటున్నారు. డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఐస్ క్యూబ్ లను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..