
నాయక్ పల్లికి చెందిన వీరన్న – కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏడాదిన్నర వయస్సు గల బాలుడు అక్షయ్ ఫిబ్రవరి 7వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ ఇంటి ముందు అరబెట్టిన పల్లి గింజలు తినడానికి ప్రయత్నించాడు. ఆ పలిగింజలు గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడు పల్లి గింజలు మింగి ఉంటాడని గమనించిన తల్లిదండ్రులు అక్కడి నుండి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. కానీ పరిస్థితి విషమించిందని ఎంజిఎంకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడి నుండి 108 లో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులను ఈ ఘటన కలచివేసింది.
మరిన్ని వీడియోల కోసం :
రన్యారావుకు కోర్టులో షాక్.. ఏమైందంటే వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో
ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్ వీడియో
మిమ్మల్ని నేను తీసుకొస్తా… సునీతకు ట్రంప్ సందేశం వీడియో