
వడోదర, మార్చి 14: గుజరాత్‌లోని వడోదరలో ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం కారు నడిపిన యువకుడు ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా రోడ్డుపై నడుకుంటూ వెళ్తూ ‘మరో రౌండ్’ అంటూ హల్చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..
గురువారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో కరేలిబాగ్ ప్రాంతంలో రక్షిత్ చౌరాసియా అనే 20 యేళ్ల యువకుడు మద్యం మత్తులో కారు నడిపాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న స్కూటీను వేగంగా ఢీ కొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం అనంతరం కారు దిగిన నిందితుడు రోడ్డుపైకి వచ్చి ‘మరో రౌండ్, మరో రౌండ్’, ‘ఓం నమః శివాయ’ అంటూ చేతులు ఊపుతూ ఫోజులు కొట్టడం స్థానికులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అతడ్ని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలిని హేమాలిబెన్ పటేల్‌గా గుర్తించారు. జైని (12), నిషాబెన్ (35), పదేళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
#Vadodara: Drunk youth hits 7 on Holi night, 1 dies
Accident near #Karelibagh Amrapali Complex, CCTV of the incident surfaced, condition of two persons is critical. This video contains potentially disturbing situation that may be harmful to some viewers. #Accident #Gujarat pic.twitter.com/AHFGyI3MFO— Namaskar Gujarat Australia (@NamaskarGujarat) March 13, 2025
రక్షిత్ చౌరాసియా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వాడని, ఎంఎస్ యూనివర్సిటీలో లా విద్యార్థిగా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో నిందితుడి పక్కనే కారు యజమాని మిత్ చౌహాన్ ఉండటం మరో విశేషం. దీంతో పోలీసులు అతన్ని కూడా అరెస్టు చేశారు. అయితే తానేమీ చేయలేదని, యాక్సిడెంట్ చేసింది రక్షిత్ అని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ప్రమాద సమయంలో రక్షిత్ గంటకు 120 కి.మీ వేగంతో కారు నడుపుతున్నాడు. వీడియోలో అతను కారుతో రెండు స్కూటర్లను ఢీకొట్టి, రైడర్లను ఢీకొట్టి, అనంతరం కొంత దూరం ఈడ్చుకెళ్లి ఆపివేయడం కనిపిస్తోంది. మృతురాలు హేమాని పటేల్ తన మైనర్ కుమార్తెతో హోలీ రంగులు కొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీసు అధికారి పన్నా మోమయ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.