
ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సురేఖ వాణి. ఆమె కూతరు సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సురేఖావాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. తన వీడియోలు, ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. అంతే కాదు ఈ మధ్య గ్లామర్ షోతో అభిమానులను కవ్విస్తుంది. హీరోయిన్స్ ను మించి తన అందాలతో మతిపోగొడుతోంది.
త్వరలోనే ఈ చిన్నది హీరోయిన్ గా సినిమా చేస్తుంది. మొనీమద్యే అమర్ దీప్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీత ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
దాంతో పోలీసులు కూడా సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ కు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చెయ్యొద్దు అంటూ అవెర్న్స్ చేస్తున్నారు కొందరు. అలానే సుప్రీత కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకండి అంటూ ఓ వీడియో చేసింది. సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. నేను కూడా గతంలో చేశాను ఇప్పుడు మానేశాను అని తెలిపింది. ఎవ్వరూ బెట్టింగ్ యాప్స్ ను నమ్మకండి. ఈజీ మనీకి అలవాటుపడకండి. బెట్టింగ్ యాప్స్ ను డిలీట్ చేయండి అంటూ వీడియో చేసింది. అలాగే ఆమె తల్లి సురేఖ వాణి కూడా ఓ వీడియో చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..