
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ సినిమాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎలాంటి సినిమాతో వస్తారు.? ఆయన లుక్స్ ఎలా ఉంటాయి.? యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి .? అంటూ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. విభిన్న కథలను చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సలార్, కల్కి సినిమాలతో రెండు భారీ హిట్స్ అందుకున్నారు. సలార్ సినిమా ఫుల్ యాక్షన్ సినిమా.. ఈ సినిమాను రెండు భాగాలుగా రానుంది. ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ 2 తెరకెక్కించనున్నాడు. అలాగే కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ కథతో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
ఇక ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే అవాక్ అవ్వాల్సిందే.. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. సలార్ 2, కల్కి 2 సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్, హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. అలాగే కన్నప్ప సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా వైరల్ అవుతున్న ప్రభాస్ ఫొటోల్లో డార్లింగ్ ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటూ కనిపించారు.
ప్రభాస్ తన ఫ్రెండ్స్ ను, ఫ్యాన్స్ ను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్ తో ఇంత క్లోజ్ గా ఉన్న ఈ అమ్మయి ఎవరో అంటూ అభిమానులు సోషల్ మీడియాను గాలిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో లేటెస్ట్ ఫోటో కాదు. బాహుబలి సినిమా సమయంలో ఫోటో ఇది. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి తమన్నా బెస్ట్ ఫ్రెండ్ , మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానిక్ అని తెలుస్తుంది. ప్రభాస్ కు అందరితో ఎంతో ఫెండ్లీగా ఉంటారు. అలా బిల్లి మానిక్ తోనూ ఎంతో ఫ్రెండ్లీ ఉండేవారు. అప్పటి ఫోటోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ ఫాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..