
పాలు శరీరానికి అత్యంత శక్తినిచ్చే ఆహారంగా పరిగణిస్తారు. ఇది కాల్షియం అద్భుతమైన మూలం కూడా. ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మంచిది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కూడా హాయిగా నిద్ర పడుతుంది. కొంతమంది ఆవు పాలు, మేక పాలు తాగితే, మరికొందరు గేదె పాలను ఇష్టపడతారు. అన్నీ ఆరోగ్యానికి చాలి మంచివే. కానీ ఇక నుంచి మీరు బొద్దింక పాలు తాగాల్సి వస్తే..? ఛీ..చీ.. అంటూ ముఖం చిట్లించుకోకండి.. ఎందుకంటే.. ఇది జోక్ కాదు.. నిజంగానే బొద్దింక పాల ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
ఇతర పాల కంటే బొద్దింక పాలలో పోషకాలు అధికంగా ఉన్నాయని కొత్త అధ్యయనం చెబుతోంది. జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రిస్టల్లోగ్రాఫిక్ యూనియన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, బొద్దింక పాలలో 45 శాతం ప్రోటీన్, 25 శాతం కార్బోహైడ్రేట్లు, 16 నుండి 22 శాతం కొవ్వు, శరీర కణాల పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయని గుర్తించారు.
మనం సాధారణంగా తాగే ఆవు పాలు లేదా గేదె పాలు కంటే బొద్దింక పాలు తాగడం వల్ల ఒక వ్యక్తికి మూడు రెట్లు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ పాలను కృత్రిమంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బొద్దింక పాలలో సాధారణ పాల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి దీనిని ప్రోటీన్ సప్లిమెంట్‌గా కూడా పరిగణిస్తారు.
ఇవి కూడా చదవండి
బొద్దింక పాలు అద్భుతమైన పోషక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, అవి ఇంకా మానవ వినియోగానికి అందుబాటులో లేవు. బొద్దింకల నుండి పాలు తీయడం చాలా సంక్లిష్టమైనది. శ్రమతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి, దాని ఉత్పత్తి అత్యంత ముఖ్యమైన అడ్డంకిగా భావిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..