
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తెలుగు స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యింది. చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ అంతగా యాక్టివ్ అనిపించడం లేదు. ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాతో అలరించనుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తుంది. మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. బీటౌన్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇటీవలే కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల సందడి చేసింది. అలాగే ఐఫా అవార్డ్స్ వేడుకలో తనకు మంచి డాక్టర్ కోడలు కావాలంటూ కార్తీక్ ఆర్యన్ తల్లి కామెంట్స్ చేయడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ కు బలం చేకూరింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నార్త్ అడియన్స్ ఎక్కువగా శ్రీలీల గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు.
శ్రీలీల 2021లో తన MBBS పూర్తి చేసింది. ఆమె తల్లి స్వర్ణలత బెంగుళూరుకు చెందిన గైనకాలజిస్ట్. శ్రీలీల చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ‘కిస్’ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది శ్రీలీల. 14 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. ఆమె భారతనాట్య నృత్యకారిణి కూడా. 2022లో, శ్రీలీల ఒక అనాథాశ్రమానికి వెళ్లి గురు, శోభిత అనే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. వారు మెరుగైన జీవితాన్ని గడపాలని ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీలీల మొత్తం నికర విలువ దాదాపు 15 కోట్లు ఉంటుందని అంటున్నారు. మొదట్లో ఆమె ఒక్కో సినిమాకు గంటకు 4 లక్షలు తీసుకునేది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు తీసుకుంటుంది. అలాగే శ్రీలీల దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ కలిసి ఆషికి 3లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2025 లో దీపావళి సందర్భంగా విడుదల అవుతుందని టాక్. ఆషికి ఫస్ట్, సెకండ్ పార్ట్స్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఆషికి 3పై మరింత హైప్ పెరిగింది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..