
అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఏప్రిల్ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. NIOS/ APOSS/ ఇతర పరీక్షలకు చెందిన అభ్యర్థులు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సహా అన్ని సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. SSC లేదా తత్సమాన పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు. ఫలితాలు మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ప్రాథమిక కీ విడుదల.. రేపటితో ముగుస్తున్న అభ్యంతరాల స్వీకరణకు గడువు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2024 పరీక్షల ప్రాథమిక కీ తాజాగా వెలువడింది. ఈ మేరకు ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 164 సెంటర్లలో 2,38,451 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మార్చి14వ తేదీలోపు రూ.200 చెల్లించి ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా తెలుపవచ్చు.
ఇవి కూడా చదవండి
సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.