
పుట్టగొడుగులు రుచికరమైన, పోషకమైన శిలీంద్రాలు. వీటిని శాఖాహారులు ఇష్టంగా తింటుంటారు. నిత్యం ఆహారంలో పుట్టగొడుగులు చేర్చుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఎంత ఉపయోగకరం. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పుట్టగొడుగుల్లో సెలీనియం ఉంటుంది ఇది సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇది ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా గుండే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాదు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను నివారిస్తుంది.
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి. పుట్టగొడుగులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పుట్టగొడుగులు తింటే దీర్ఘకాలిక మలబద్దక సమస్య కూడా తగ్గిపోతుంది. డయాబెటిస్ వారు కూడా పుట్టగొడుగులు మంచివి ఇన్సులిన్ నిరోధకతకు ప్రేరేపిస్తుంది.
అధ్యయనం ప్రకారం బలహీనమైన జ్ఞాపకశక్తి, భాష సమస్యలు, అభిజ్నా బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి. పుట్టగొడుగుల్లో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్ గా పనిచేయడంతోపాటు శరీరంలో అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు కలిగి ఉండే హానికరమైన ప్రభావాలను తొలగించేస్తుంది. రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..