
రైల్లో చెత్త బుట్ట నిండిపోవడాన్ని ఆ సీనియర్ ఉద్యోగి గమనించారు. కదులుతున్న రైల్లో నుంచే చెత్తను పట్టాల పైకి విసిరేశారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు అలా చేయకండి అంటూ వారించారు. అయినప్పటికీ ఉద్యోగి నవ్వుతూ.. మరి చెత్తను ఇంకెక్కడ వేయమంటారు? అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీనియర్ ఉద్యోగి అయినా.. మతి లేకుండా ప్రవర్తించారు’ అని ఒకరు.. ‘ఇది మన భారత రైల్వే వ్యవస్థ పరిస్థితి’ అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం తప్పుగా అనిపించడం లేదా..?’ అని ప్రశ్నించారు. ఈ ఘటనపై రైల్వే సేవ స్పందించింది. అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రైల్లోని చెత్తను తీసేందుకు యంత్రాంగం ఉంది. విధుల్లో ఉండి నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం. జరిమానా కూడా విధించాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. సదరు ఉద్యోగిపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి.. చివరకు
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
Rashmi Gautam: పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి..