
పై ఫొటోలో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు నాట చాలా సెన్సేషన్. ముఖ్యంగా బుల్లితెర ఆడియెన్స్ కు ఈ అందాల తార ఫేవరెట్ నటి. అలాగనీ ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సీరియల్స్ లో నటించలేదు. కేవలం ఒక్క సీరియల్ తోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది దీపిక. పేరుకు తమిళ నటే అయినా పక్కింటమ్మాయిలా మారిపోయింది. ఇక టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో ఈ అందాల తార చేసే సందడి అంతా ఇంతా కాదు. వచ్చిరానీ తెలుగుతో ఈ నటి చేసే సందడి మాములుగా ఉండదు. ఇలా తెలుగు బుల్లితెరపై జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఈ బ్యూటీ మరెవరో కాదు బ్రహ్మముడి నటి కావ్య అలియాస్ దీపిక రంగరాజు. ఇది ఆమె టీనేజ్ నాటి ఫొటో.
ఇవి కూడా చదవండి
తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ తమిళ ఛానెల్లో న్యూస్ ప్రజెంటర్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక 2023లో బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది.ఇక తెలుగు నాట బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న టీవీ సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ మానస్ భార్య కావ్య పాత్రలో దీపిక రంగరాజు అద్భుతంగా నటించింది. ఈ సీరియల్ తో దీపిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు బుల్లితెరపై వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.
దీపిక రంగరాజు లేటెస్ట్ ఫొటోస్..
పల్లెటూరి పిల్లలా దీపిక రంగరాజు..
మానస్ బర్త్ డే వేడుకల్లో కావ్య .. వీడియో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..