
లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో 97వ ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓబ్రియాన్ హోస్ట్‌గా వ్యవహరించారు.
ఈ సారి ఇండియన్ సినిమాలేవీ రేసులో లేవు. ఉత్తమ నటుడుగా ది బ్రూటలిస్ట్ సినిమాకు గానూ అడ్రియన్ బ్రాడీ.. నటిగా అనోరా సినిమాకు మైకీ మాడిసన్ ఎంపికయ్యారు.
ఈ సారి అకాడమీ అవార్డుల్లో అనోరా సినిమా సత్తా చూపించింది. ఉత్తమ నటితో పాటు ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లోనూ అనోరాకు అవార్డులొచ్చాయి.
ఇది ఓ వేశ్య కథ. చదువు కోసం USA వచ్చిన ఒక రష్యన్ కోటీశ్వరుడు 23 ఏళ్ల వేశ్యతో ప్రేమలో పడతాడు.. వాళ్ళ పెళ్లికి కుటుంబం ఒప్పుకోదు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
ఉత్తమ సహాయ నటుడుగా ది రియల్ పెయిన్లో నటనకు గానూ కీరన్ కైల్ కల్కిన్, ఉత్తమ సహాయ నటిగా ఎమిలియా పెరేజ్ సినిమాకు జోయా సాల్దానా, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో డ్యూన్: పార్ట్2, బెస్ట్ యానిమేటెడ్ సినిమాగా ఫ్లో, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్ సినిమాలు నిలిచాయి.