
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ నిశ్శబ్దంగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమై ఉండవచ్చు. కానీ, ఈ చిన్న ఇన్నింగ్స్‌లో కూడా అతను తన పేరు మీద ఒక భారీ రికార్డును సృష్టించాడు. సిక్సర్ల పరంగా క్రిస్ గేల్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.
ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో కలిపి అతను మొత్తం 65 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ కేవలం 42 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. అతను 51 ఇన్నింగ్స్‌లలో మొత్తం 64 సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా, రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ఈవెంట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సృష్టించాడు.
రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే, సిక్సర్లు అవలీలగా బాదే ప్లేయర్‌గా పేరుగాంచాడు. సిక్సర్ల పరంగా అతను చాలా మంది గొప్ప బ్యాట్స్మెన్లను వదిలిపెట్టాడు. ఇప్పటివరకు రోహిత్ ప్రతి ఫార్మాట్లో సిక్సర్లు ఈజీగా బాదేస్తుంటాడు. రోహిత్ ఇప్పటివరకు 272 వన్డే మ్యాచ్‌లు ఆడి 341 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 350 వన్డే సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు రోహిత్‌కు 9 సిక్సర్లు అవసరం.
ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రిది (351) పేరిట ఉంది. అతను 398 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఇప్పటికే రికార్డు సృష్టించాడు.