
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో.. కావ్య చేసిన అవమానం నువ్వు ఎలా భరిస్తున్నావు అన్నాయ్యా? ఇన్ని రోజులూ తనని తిట్టో.. భయపెట్టో నోరూ మూయించాను. ఇక నా వల్ల కాదు అన్నయ్యా.. ఈ మౌనం, మంచితనం కావ్య దృష్టిలో చేతకానితనం కాదు అన్నయ్యా అని ప్రకాశం అంటాడు. పక్కనే ఉండి అంతా వింటుంది కావ్య. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు అనుకున్నా.. కానీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కావ్య అందని నేను తనని తప్పు పట్టాలా.. నలుగురూ నలుగురూ అంటున్నావే.. వాళ్లు ఎవరు? మన వాళ్లే కదా.. వాళ్ల ముందు నా విలువ పోయిందని నేను ఎందుకు అనుకోవాలి. తను నన్ను అన్నదని బాధ పడటం లేదు. అలా ఎందుకు అందా అని ఆలోచిస్తున్నా. ఎప్పుడూ మాట జారని కావ్య.. ఈ రోజు ఆ మాట అంది అంటే తనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందోనని ఆలోచిస్తున్నా.. ఈ రోజు ఏదో అంది కదా అని తనని శత్రువుగా చూడలేను. నిజంగా తను తప్పు చేస్తే.. పెద్దలుగా మనం సరి చేయాలని సుభాష్ అంటాడు. నీ అంత గొప్పగా నేను ఆలోచించలేను అన్నయ్యా.. నీ మీద గౌరవంతో నేను మౌనంగా ఉన్నా.. నా భార్య అన్న పని నేను చేయకుండా ఉండలేను.. నన్ను క్షమించు అని ప్రకాశం అంటాడు.
భోజనానికి రాని అపర్ణ..
ఆ తర్వాత అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. అక్కడికి సుభాష్, అపర్ణలు రారు. కావ్య అందరికీ వడ్డిస్తూ ఉండగా వద్దని ధాన్యలక్ష్మి గ్యాంగ్ అంటారు. ఇక దొరికిందే కదా ఛాన్స్ అని స్వప్న బాగా దెప్పిపొడుస్తుంది. మీ చెల్లి చేతితో వడ్డిస్తే తినడం ఇష్టం లేక.. మా వదిన, అన్నయ్యలు భోజనానికి రాలేదు. ఇంత మందిలో పరువు తీసిందిగా.. ఇంకేం వస్తారు? అని రుద్రాణి అంటుంది. అప్పుడే సుభాష్ వచ్చి కూర్చుంటాడు. కనీసం మా వదినకు అయినా పౌరుషం ఉందని రుద్రాణి అంటుంది. అమ్మమ్మ గారు అత్తయ్య గారు భోజనానికి రాలేదని కావ్య అంటే.. నువ్వేం బాధ పడకు.. ఇక్కడ కుక్కలు, నక్కలు మొరుగుతాయని రానట్టు ఉందని ఇందిరా దేవి అంటుంది. పెద్దావిడ అన్న మాటలకు భోజనం దగ్గర నుంచి లేచి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి. గదిలోకి వెళ్లి అటూ ఇటూ తిరుగుతుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది. ఆ కావ్య అన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. అయినా ఆ కావ్య చేసిన వంటని ఏ ముఖం పెట్టుకుని తింటామని ధాన్యలక్ష్మి అంటుంది.
ప్రకాశం అన్నయ్యని నీ వైపుకు తిప్పుకో..
నేను ఆల్రెడీ చెప్పాను కదా.. వాళ్లు ఏదో ఒక ప్లాన్ చేసుకుని వస్తారని మొత్తుకున్నా.. విన్నావా.. అది వచ్చి పెద్ద నోరు వేసుకుని నాలుగు డైలాగ్స్ చెప్పగానే నోరు మూసుకున్నావు. దానికి ఇప్పుడు అధికారం అంతా ఇచ్చేసరికి రెచ్చిపోయి.. ప్రశ్నించిన వాళ్ల బెండు తీస్తాను అంటోంది. ఈ రోజు మా బావగారిని అన్నేసి మాటలు అన్నా ఎవరూ ఏమీ అనలేదు. ఇలాగే వదిలేస్తే మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఈలోపే ఏదో ఒకటి చేయాలని ధాన్యలక్ష్మి ఆవేశ పడుతుంది. నువ్వు ప్రకాశం అన్నయ్యని నీ దారికి తెచ్చుకో.. అప్పుడు నీకు చేయాల్సిన న్యాయం చేస్తారని రుద్రాణి సలహా ఇస్తే.. నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉందని ఆ దారినే ఫాలో చేస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత మావయ్యా.. నన్ను కేవలం మా అమ్మానాన్నలు మాత్రమే అర్థం చేసుకుంటారు అనుకున్నా.. కానీ ఆ తర్వాత మీరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు అందుకు థాంక్స్ అని చెబుతుంది కావ్య.
ఎవరు ఏం అనుకున్నా నేను నీకే సపోర్ట్ చేస్తాను..
ఇంట్లో నేను ప్రవర్తిస్తున్న తీరు చూసి అందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఆస్తిని నా పేరు మీద రాయగానే నిందలు వేస్తున్నారు. కానీ మీరు మాత్రమే నా ప్రవర్తన వెనుక బలమైన కారణం ఉంటుందని నమ్మారు. నేనూ నిన్ను చూసి అలాగే ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు మాయ విషయంలో.. అందరూ నన్ను దోషిగా చూసినా.. నువ్వు మాత్రం నేను తప్పు చేయలేదని నమ్మావు. నువ్వు మాత్రమే నా వైపు నిలబడ్డావు. నాకు సహాయం చేశావు కదా అని నేను నీకు సపోర్ట్ చేయడం లేదు. కొద్దిగా కూడా స్వార్థం లేని నిన్ను నేను అపార్థం చేసుకోను. నా కోడలు ఏ తప్పూ చేయదని చెప్పి సుభాష్ వెళ్తాడు. దీంతో కాస్త సంతోష పడుతుంది కావ్య. మరోవైపు అపర్ణ గదిలో ఉండగా.. ఇందిరా దేవి భోజనం తీసుకొస్తుంది. పాపం కావ్య ఏం తప్పు చేసిందని చేయి ఎత్తావు? అని ఇందిరా దేవి అడిగితే.. కట్టుకున్న భర్తని తక్కువ చేసి మాట్లాడితే ఏ భార్యకు అయినా కోపం వస్తుంది కదా.. కావ్య లాంటి మనిషి అలా మాట్లాడితే తట్టుకోలేక పోయానని అపర్ణ అంటే.. నీకు తెలుసు కదా.. కారణం లేకుండా కావ్య ఏదీ చేయదని పెద్దావిడ అంటే.. అదేంటో నాతో చెప్పాలి కదా.. చెబితే నేను అండగా నిలబడతాను కదా అని అపర్ణ అంటుంది.
నంద గోపాల్ చనిపోవడం వల్ల ఎవరికి లాభం..
నీతో కూడా చెప్పుకోలేక పోతుంది అంటే అది ఎంత క్షోభ అనుభవిస్తుందో ఏమో.. సరే అది సరైన కారణం చెబితే క్షమిస్తావు కదా ఇందిరా దేవి అంటే.. ఏమో అని అపర్ణ అంటుంది. ఇక అపర్ణకు అన్నం తినిపిస్తుంది పెద్దావిడ. మరోవైపు కావ్య బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగితే.. నంద గోపాల్ని చనిపోతే.. మనకు నష్టం. కానీ అతను చనిపోవడం వల్ల ఎవరికి లాభం? అని కావ్య అడుగుతుంది. అవును కదా ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదని రాజ్ అంటాడు. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
