

గత కొంతకాలంగా ఐటీ రాజధాని బెంగళూరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. బెంగళూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటం చూశాం. అలాగే, అక్కడి అద్దె ఇళ్ల ధరలు కూడా ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అద్దె ధరలు, అద్దె ఇళ్లల్లోని వసతులకు సంబంధించిన వార్తలు అనేకం చూశాం. బెంగళూరులోని యువతీ యువకులు చేస్తున్న కొన్ని స్టంట్లు కూడా ఇప్పుడు నెటిజన్లను నోరెళ్ల బెట్టేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఒక యువతి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న తీరు నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ వీడియో ఆధారంగా.. బెంగళూరులో ఒక యువతి హెల్మెట్ పెట్టుకొకుండా వాహానం నడుపుతోంది. అంతేకాదు..భుజంపై తన పెంపుడు రామచిలుకను పెట్టుకుని మరీ డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాఫిక్ లో రచ్చ చేసింది. యువతి వెనుకాల ఉన్న కొంత మంది వాహనదారులు, ప్రయాణికులు ఇదంతా వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దాంతో ఈ ఘటన వేగంగా వైరల్గా మారింది. రోడ్డు భద్రత నియమాలను పాటించాలంటూ పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రజలు మండిపడుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
Never a dull moment in Bangalore pic.twitter.com/IzUr5nRaP8
— Rahul Jadhav (@iRahulJadhav) February 28, 2025
వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. ఇలాంటి వారిని తగిన రీతిలో శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పొరపాటున ఆమె ఏమైన డైవర్ట్ అయితే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని కొందరు మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…