
సినిమా సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్, రూమర్లు పుట్టుకు రావడం సహజమే. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఇలాంటి ఊహాజనిత కథనాలు, వీడియోలతో ఇబ్బంది పడిన వారే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. సోషల్ మీడియాలో ఆయన గురించి ఒక కల్పిత వార్త తెగ వైరలవుతోంది. అదేంటంటే.. సినిమా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు చిరంజీవి. ఫిల్మ్ ఫేర్ నుంచి పద్మ విభూషణ్ దాకా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు బాస్ కీర్తి కీరిటంలో చేరాయి. ఇదే క్రమంలో చిరంజీవికి యూకే ప్రభుత్వం.. ఆ దేశ పౌరసత్వాన్ని గౌరవార్ధంగా ఇచ్చిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. . దీనిపై చిరంజీవి పీఆర్ టీమ్ స్పందించింది. చిరంజీవి గారు బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి నిరాధార వార్తలు ప్రచురించేటప్పుడు మీడియా సంస్థలు ఒకసారి నిజ నిర్ధారణ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది.
ఈ రూమర్స్ సంగతి పక్కన పెడితే.. యూకేలో చిరంజీవిని సన్మానించేందుకు ఓ కార్యక్రమం ప్లాన్ చేశారట. అయితే ప్రస్తుతం వస్తోన్న రూమర్స్ దృష్ట్యా ప్రస్తుతం చిరంజీవి ఆ కార్యక్రమానికి కూడా హాజరుకావటం లేదని తెలిసింది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో విశ్వంభర షూటింగ్ పనుల్లో మళ్లీ బిజీ కానున్నారు.
ఇవి కూడా చదవండి
స్పందించిన పీఆర్ టీమ్..
Reports of Megastar #Chiranjeevi Garu receiving honorary UK citizenship are false. We request news outlets to verify before publishing any such news.
— Beyond Media (@beyondmediapres) March 1, 2025
విశ్వంభర సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్. దీంతో అతని తర్వాతి సినిమా ఏంటన్న ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా సినిమా ప్రకటించడంతో ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
విశ్వంభర సెట్ లో మెగాస్టార్ చిరంజీవి..
MEGASTAR @KChiruTweets garu sets the stage on fire with his swag, dancing to an electrifying composition by @mmkeeravaani garu. 🤩💥 Thank you, @shobimaster ✨
Can’t wait for you all to experience it!! 🫶
Get ready for MEGA MASS BEYOND UNIVERSE 🔥 #Vishwambhara pic.twitter.com/TDnfwNhymH
— Vassishta (@DirVassishta) February 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.