
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఆర్సీబీని 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి తమ విజయపరంపరను కొనసాగించింది. అదే సమయలో ఆర్సీబీ వరుసగా నాలుగో మ్యాచ్‌లో నూ ఓటమి మూటగట్టుకుంది. RCB సొంతగడ్డపై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలు కావడం గమనార్హం. జట్టు పేలవమైన ప్రదర్శనకు బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
ఈ తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు పేలవమైన ఆరంభం లభించింది. జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ 12 బంతుల్లో 2 పరుగులు చేసి ఔటైంది.అయితే మరో ఓపెనర్ షఫాలీ వర్మ, జెస్ జోనాసెన్ ఇన్నింగ్స్ బాధ్యతను స్వీకరించి జట్టును విజయపథంలో నడిపించారు. ఇద్దరూ 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షఫాలీ వర్మ 43 బంతుల్లో 80 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. జెస్ జోనాసెన్ 38 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 61 పరుగులు చేసింది. ఆర్సిబి తరఫున రేణుకా సింగ్ ఠాకూర్ ఒక వికెట్ తీసింది.
ఇవి కూడా చదవండి
సెమీస్ కు ఢిల్లీ..
𝚃𝚑𝚒𝚛𝚍 𝚂𝚞𝚌𝚌𝚎𝚜𝚜𝚒𝚟𝚎 𝚃𝚒𝚖𝚎 👏
Delhi Capitals are the first team to add the ‘𝑸’ in the Points Table 🥳
Which 2 teams will join #DC? 🤨#TATAWPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/JKnbl88GQ6
— Women’s Premier League (WPL) (@wplt20) March 1, 2025
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆర్సిబి తరఫున, ఎల్లీస్ పెర్రీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 47 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 60 పరుగులు చేసింది. ఆమెతో పాటు రాఘవి బిష్ట్ 32 బంతుల్లో రెండు సిక్సర్లతో సహా 33 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున శిఖా పాండే, శ్రీ చరణి తలా రెండు వికెట్లు పడగొట్టారు. మరిజన్నే కప్ ఒక వికెట్ పడగొట్టింది.
ఆఖరి స్థానంలో ఆర్సీబీ..
The Points Table leader add the ‘𝙌’ against them 👀
The Meg Lanning-led Delhi Capitals continue their winning streak 👏
Predict the other 2️⃣ teams for the playoffs ✍#TATAWPL | @DelhiCapitals pic.twitter.com/7yYk2VNzdg
— Women’s Premier League (WPL) (@wplt20) March 1, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..