
కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది హీరోయిన్ పూజా హెగ్డే. అటు హిందీలో.. ఇటు తెలుగు, తమిళంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయకుండా సైలెంట్ అయ్యింది. అటు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అయ్యింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ సినిమా కూలీ కోసం పూజా హెగ్డే ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ పాటను స్వరపరిచారు. అయితే ఈ పాట కోసం పూజా దాదాపు ఒక సినిమా రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. అంటే పూజా రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటుందట.
కొన్ని తెలుగు సినిమాలు డిజాస్టర్స్ అయినప్పటికీ తమిళంలో ఆమె నటించిన సినిమాలు హిట్టయ్యాయి. దీంతో ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ ఓకే చేస్తోన్న పూజా.. తన పారితోషికాన్ని తగ్గించుకుంది. ఆమె ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లకు పైగా సంపాదిస్తోంది.
ఇదివరకు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్స్ చేసింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే జిగేలు రాణి అంటూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు కూలీతో ఆమె మరోసారి అలరించేందుకు రెడీ అయ్యింది.