రైల్లో ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరికీ టికెట్తప్పనిసరి.! కానీ ఒక పోలీసు టికెట్ లేకుండా నేరుగా 3 ACలోకి ప్రవేశించినప్పుడు TTE అతనితో వ్యవహరించిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న సదరు పోలీస్ ఆఫీసర్‌ను గమనించిన TTE ఏం చేశాడు.. అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీస్.. టీటీఈ ఏం చేశాడంటే? పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ వీడియో ప్రకారం.. ఈ రైలులో జనరల్ కోచ్ నుండి స్లీపర్, 3 ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వరకు టిక్కెట్లు ఉన్నాయి. దీన్ని తనిఖీ చేసే బాధ్యత TTE కి ఉంటుంది. ఒక ప్రయాణీకుడి వద్ద టికెట్ లేకపోతే, అతనికి జరిమానా విధించే అధికారం, ప్రతికూల పరిస్థితుల్లో అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే అధికారం కూడా TTEకి ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఎలాంటి టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించాడు. ఒక బెర్త్‌పై హాయిగా నిద్రపోతున్నాడు.. అది గమనించిన టీటీఈ సదరు పోలీస్‌ను టికెట్ చూపించాలని అడిగాడు. అతని వద్ద టికెట్ లేదని తెలిసింది. దీంతో యూనిఫార్మ్ ధరించిన పోలీస్‌ను టికెట్ చూపించమని టీటీఈ అడగకూడదని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ‘కనీసం జనరల్ కోచ్ టికెట్ కూడా మీ వద్ద లేదు. కానీ ఏసీ కోచ్‌లో నిద్రపోతున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవడానికి ఇది మీ ఇల్లని అనుకుంటున్నారా? లేచి వెళ్లండి’ అని మండిపడ్డాడు. దీంతో ఆ పోలీస్ బెర్త్ నుంచి లేచి తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇవి కూడా చదవండి
Kalesh b/w a TTE and Police (TTE confronts a cop for travelling without ticket in the AC coach) pic.twitter.com/LL0BDYh3Ah
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీస్‌ను ధైర్యంగా టీటీఈ నిలదీయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. అయితే టికెట్ లేకుండా ప్రయాణించిన ఆ పోలీస్‌కు ఎలాంటి జరిమానా విధించకుండా టీటీఈ వదిలేసిన తీరును కొందరు విమర్శించారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 80 వేలకు పైగా వీక్షణలు, వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అయితే పోస్ట్‌పై డజన్ల కొద్దీ వ్యాఖ్యలు ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
