ప్రస్తుత కాలంలో ఊబకాయం పెను సమస్యగా మారుతోంది.. ఇది అన్ని జబ్బుల బారిన పడేలా చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలలో ఊబకాయం సమస్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఒక నివేదిక విడుదలైంది. గత దశాబ్దంలో పెద్దలలో కంటే పిల్లలలో ఊబకాయం ఎక్కువగా పెరుగుతోందని ప్రపంచ ఊబకాయ నివేదికలో చెప్పబడింది. దీనికి అనేక కారణాలను వివరించారు. పెరుగుతున్న ఊబకాయం కారణంగా, పిల్లలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు.. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని నివేదికలో పొందుపరిచారు. ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే.. పిల్లలు ఎందుకు ఊబకాయంతో బాధపడుతున్నారు.. దీనిని ఎలా నియంత్రించవచ్చు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం రేటు 1990తో పోలిస్తే 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగిందని అంచనా.. భారతదేశంతో సహా అనేక దేశాలలో పిల్లలలో ఊబకాయం పెరిగింది. దీని కారణంగా, పిల్లలలో టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల కేసులు కూడా పెరిగాయి. కొన్ని సందర్భాల్లో, పిల్లలు గుండె జబ్బుల కారణంగా కూడా మరణించారు. ఊబకాయం కారణంగా పిల్లలలో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కూడా కనిపించాయి. దీని కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమైంది.
పిల్లల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతోంది?
పిల్లలలో ఊబకాయం రేట్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని, వాటిలో పిల్లల జీవనశైలి క్షీణించడం ఒక ప్రధాన కారణమని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అంకిత్ వివరిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు మొబైల్, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చుంటారు.. దీని కారణంగా వారికి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది.
ఇంకా ఆహారం.. పిల్లల్లో జంక్ ఫుడ్ తినే ధోరణి కూడా వేగంగా పెరుగుతోందని.. దీనివల్ల ఊబకాయం ప్రమాదం పెరుగుతోందని వివరించారు.
ఇది కాకుండా, ఊబకాయం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఊబకాయం రావచ్చు.
ఇంకా కొన్ని సందర్భాల్లో, జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఊబకాయాన్ని ప్రోత్సహిస్తాయి.
పిల్లల్లో ఊబకాయాన్ని ఎలా నియంత్రించాలి
పిల్లలు క్రీడలు ఆడేలా ప్రోత్సహించండి
పిల్లల ఆహారంలో పిండి, చక్కెర, ఉప్పును తగ్గించండి.
ఎటువంటి కారణం లేకుండా పిల్లలు ఫోన్లు, ల్యాప్టాప్లను ఉపయోగించడానికి అనుమతించవద్దు.
ఇంటి వాతావరణాన్ని మంచిగా ఉంచుకోండి.. పిల్లలకు మానసిక ఒత్తిడి తలెత్తకుండా చూడండి..
ఆహారం, నిద్ర, జీవనశైలిని మెరుగుపర్చాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
