నటుడు బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాలు, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ.. “నేను డైటింగ్ చేయను, తక్కువ మోతాదులో తరచుగా తింటాను” అని అన్నారు. వైట్ రైస్ పూర్తిగా మానేసి, మిల్లెట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకుంటానని, ఉదయం మిల్లెట్స్ తింటానని చెప్పారు. రాత్రిపూట డిన్నర్‌ను స్కిప్ చేయకుండా చికెన్ స్టూ, సూప్, ఇడ్లీ లేదా దోశ వంటి తేలికపాటి ఆహారాన్ని 7 గంటలకల్లా తీసుకుంటానని తెలిపారు. ఆరోగ్య స్పృహతో ఈ అలవాట్లను అలవర్చుకున్నానని బ్రహ్మాజీ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
తాను ఎప్పుడూ హేవీ ఫుడీని కాదని, తినడానికి ఇష్టపడినా, ఎక్కువగా తిననని తెలిపారు. అప్పుడప్పుడు డ్రింక్ చేస్తానని, సింగిల్ మాల్ట్ తన ఫేవరేట్ అని చెప్పారు. తన గ్లాస్‌మేట్ ఎవరూ ఉండరని, బయటకు వెళ్లడం కంటే ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతానని ఆయన పేర్కొన్నారు. తన కొడుకు బాబు నటనపై ప్రశంసలు కురిపించిన బ్రహ్మాజీ, అతనిలో ఉన్న సహనం తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
ఒకప్పుడు తెలంగాణ ప్రజలు మాత్రమే చూసేవారని అనుకున్న ఇలాంటి చిత్రాలను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఇష్టపడుతున్నారని చెప్పారు. మంచి సినిమా అనేది ఎక్కడైనా ఒకటేనని, భాషా భేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తున్న తరుణంలో, ఇలాంటి నేటివిటీ ఉన్న సబ్జెక్టులు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
