తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది.. అంతేకాకుండా.. ఈశాన్య రుతుపవనాల వర్షాలు నిష్క్రమించటానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహే, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ – దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాలలో రాగల 2 రోజుల్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు నిష్క్రమించటానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
శుక్రవారం, శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ:-
శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు/ఆగ్నేయ దిశల నుండి వీచుచున్నవి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
