ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు తన ఆర్థిక, నీతి శాస్త్రం ద్వారా సులభమైన పరిష్కారాలను చూపించారు. నీతి శాస్త్రం అనే పుస్తకంలో చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలనే విషయాలను పేర్కొన్నారు. ఒక వ్యక్తికి ఎన్ని రకాల శత్రువులు ఉంటారు? ఏ శత్రువు పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి? ఏ శత్రువును ఎలా ఓడించాలనే విషయాలను వివరించారు.
మీరు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. మీ శ్రువులు కూడా పెరుగుతారని చాణక్యుడు తెలిపారు. ఎందుకంటే, సమాజంలో మీరు బాగా చేస్తున్నారని ఎప్పుడూ చూడలేని వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మనం అలాంటి వారిని గుర్తించాలి. అలాంటి వారి పట్ల మన ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా మనకు హాని చేయవచ్చని చాణక్యుడు హెచ్చరించారు.
రెండు రకాల శత్రువులు
చాణక్యుడు తన నీతిశాస్త్రంలో రెండు రకాల శుత్రువుల గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. ఒక వ్యక్తికి ఇద్దరు శత్రువులు ఉంటారని, ఒకరు రహస్య శత్రువు, మరొకరు బహిరంగ శత్రువు అని చాణక్యుడు చెప్పారు. బహిరంగ శత్రువుల కంటే రహస్య శత్రువులు చాలా ప్రమాదకరమైనవారు. బహిరంగ శత్రువులుగా ఉన్నవారి పట్ల మనం జాగ్రత్తగా ఉండవచ్చు కాబట్టి వారు మనపై కుట్రలు పన్నుతుంటే.. మనం దానిపై జాగ్రత్త పడతాం.
కానీ, రహస్య శత్రువుల విషయంలో ఇది సాధ్యం కాదు. రహస్య శత్రువులు ఎప్పుడూ మీ చుట్టూ ఉంటారు. వారు మీ గొప్ప శ్రేయోభిలాషులని మిమ్మల్ని అనుకునేలా చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కానీ, వారి మనసులో మాత్రం మీపై ఎప్పుడూ కోపం ఉంటుంది. అలాంటి వ్యక్తులు చాలా మోసపూరితంగా ఉంటారు. వారికి అవకాశం వచ్చినప్పుడు వారు మీకు హాని చేస్తారని చాణక్యుడు హెచ్చరించారు.
మనిషికి అతిపెద్ద శత్రువు ఎవరు?
మనషికి అతిపెద్ద శత్రువు ఆకలి అని చెప్పారు చాణక్యుడు. ఆకలి ఏదైనా చేయగలదు. శూన్యం కారణంగా మనిషి ఏ పని చేయలేడు. అందుకే ఆకలి మనిషికి అతిపెద్ద శత్రువు. ఆకలితో ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా నేరం చేయడానికి వెనుకాడడు. అందుకే చాణక్యుడు ఆకలి మనిషికి అతిపెద్ద శత్రువు అని వివరించారు.
Note: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
