
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షోకు రోజు రోజుకీ మరింత ఆదరణ లభిస్తుంది. ఇటీవలే ప్రారంభమైన ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మొత్తం ఐదుగురు మెంటార్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కో మెంటార్ కు ఒక్కో పార్టిసిపెంట్ ఉన్నారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ లోనే ఎలిమినేషన్ అంటూ షాకిచ్చాడు ఓంకార్. ఇటీవలే షో స్టార్ట్ కాగా.. ఇప్పుడే ఎలిమినేషన్ ఏంటీ అంటూ అవాక్కయ్యారు అడియన్స్. ఈ షోలో మొదటి ఎలిమినేషన్ శుక్రవారం జరిగింది. ఇలా వచ్చిన వెంటనే ఎలిమినేషన్ ఏంటీ అంటూ జడ్జి ఫరియా అబ్దుల్లా రిక్వెస్ట్ చేసినా.. ఎలిమినేషన్ మాత్రం జరిగిపోయింది.
డ్యాన్స్ ఐకాన్ 2లో సీరియల్ నటీనటులు దీపిక, మానస్, బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ చెల్లి ప్రకృతి, ఫోక్ డ్యాన్సర్ జాను లిరి, కొరియోగ్రాఫర్ యశ్వంత్ మెంటార్స్ గా ఉన్నారు. ఈ కొత్త సీజన్లో మొదటి చారిత్రాత్మకమైన డ్యాన్స్-ఆఫ్ తర్వాత మెంటార్ జానులిరి కంటెస్టెంట్ షోనాలి శుక్రవారం ఎలిమినేట్ అయ్యారు. వీరిద్దరు ఎలిమినేట్ కావడంతో జడ్జీలు, ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు.
ఇక మెంటర్ ప్రకృతి కంభం కంటెస్టెంట్ బర్కత్ అనారోగ్య సమస్యలతో షోలో పాల్గొనలేకపోయారు. తాజా ఎపిసోడ్ లో హోస్ట్ ఓంకార్ బర్కత్ స్థానంలో వర్తికా ఝాను పరిచయం చేశారు. వర్తికా వైల్డ్ ఫైర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. జానులిరి, షోనాలి ఎలిమినేషన్ తర్వాత రాబోయే ఎపిసోడ్ లో ఊహించని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా మరిన్ని సర్ ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..