
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చెట్లు, మొక్కలు చాలా ఉన్నాయి. వీటిని అనేక ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ రోజు మనం పువ్వులు, బెరడు, ఆకులు సహా ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన ఒక చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం. పుష్పించే ఈ చెట్టు పొడి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవి కాలంలో విరగబూసే ఈ చెట్టు నిండా గులాబీ, పసుపు, ఎరుపు రంగుల కలయికతో కూడిన పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ చెట్టు ఆకులు, కొమ్మలు, కాడలు, బెరడు, వేర్లు, పూలు ఇలా అన్ని భాగాలు పలు రకాలుగా ఉపయోగపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయా ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మీకు ఏదైనా గాయం అయినప్పుడు మోదుగ చెట్టు ఆకులు, బెరడును మెత్తగా చేసి ఈ పేస్ట్‌ను గాయం మీద పూయండి. అది గాయం త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది. మోదుగ చెట్టు ఆకుల నుండి రసం తీసి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీకు చర్మం పొడిబారడం, దురద వంటి సమస్య ఉంటే దాని పువ్వులను పేస్ట్ చేసి అప్లై చేయడం ద్వారా ఈ సమస్య కొన్ని రోజుల్లో నయమవుతుంది. చర్మం కూడా మెరుస్తుంది.
కడుపులో పురుగులు ఉంటే, మోదుగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసి గోరువెచ్చని నీటితో త్రాగాలి. మోదుగ చెక్కరసంతో చేసిన కషాయం తీసుకుంటే వాత శ్లేష్మాలు, మూల రోగాలు, స్త్రీ వ్యక్తిగత వ్యాధులు నయం అవుతాయి. మోదుగ ఆకుతో చేసిన విస్తరిలో భోజనం చేస్తే కడుపులో గడ్డలు, రక్తంలో వేడి, పైత్యం తగ్గుతాయి. వయసు పైబడకుండా, ఎన్నో వ్యాధులను జయించి చిరాయువును అందించగల అమృతశక్తి మోదుగ చెట్టుకి వుంది.
ఇవి కూడా చదవండి
గ్రాము మోదుగ గింజల చూర్ణానికి 5 గ్రాముల బెల్లం కలిపి నూరి పరగడుపున తింటే బహిష్టు నొప్పి తగ్గుతుంది. మోదుగ గింజలను నిమ్మరసంతో మెత్తగా నూరి గజ్జి, తామరలకు పైనపూస్తే ఒక్కరోజులోనే రోగం తగ్గిపోతుంది. మోదుగ గింజలను మంచినీటితో మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టుకుని రెండుపూటలా ఒక్క మాత్ర వేసుకుంటే మూలవ్యాధి తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..