
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటిలోనూ ముందుకు సాగుతూ బిజీగా ఉంటోంది. ఇటీవల పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో తన వివాహ బంధానికి ముగింపు పలికిన ఆమె, ఇప్పుడు దుబాయ్‌లో నివాసం ఉంటోంది. ఈ సమయంలో ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు గాసిప్‌లు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా సానియా భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన రాబిన్ ఊతప్పతో డిన్నర్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
సానియా మీర్జా, రాబిన్ ఊతప్ప మధ్య ఇప్పటి స్నేహం కాదు, ఇది చాలా ఏళ్ల కిందటే ప్రారంభమైనది. వీరిద్దరూ గడిపిన అద్భుతమైన క్షణాలను అభిమానులతో పంచుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా, వారి కుటుంబాలు దుబాయ్‌లో ఓ రెస్టారెంట్లో కలిశాయి. లంచ్, డిన్నర్‌ను కలిసి ఎంజాయ్ చేశారు. ఊతప్ప కుటుంబంతో పాటు ఇతర కుటుంబ స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక డిన్నర్ వేళలో సానియా తన బ్యూటీ సీక్రెట్ కూడా వెల్లడించింది. ఆమె తన ఆరోగ్యకరమైన జీవనశైలిని గురించి చెబుతూ, “వ్యాయామం చేయడం, కుటుంబంతో సమయం గడపడం ఇవన్నీ నా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఇవి నా దినచర్యలో ముఖ్యమైన భాగాలు.” అని పేర్కొంది. ఫొటోలలో సానియా ఎంతో అందంగా, ఆనందంగా కనిపించడంతో అభిమానులు ఆమె పోస్ట్‌పై ఆసక్తిగా స్పందిస్తున్నారు.
షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత సానియా తన జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించింది. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను సమతుల్యం చేసుకుంటూ స్నేహితులతో, కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతోంది. రాబిన్ ఊతప్పతో తన అనుబంధాన్ని మరింత బలపరచుకుంటూ, ఈ స్నేహాన్ని అభిమానులతో పంచుకోవడం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పినప్పటికీ, సానియా మీర్జా ఇప్పటికీ క్రీడా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఆమె కొత్త ప్రాజెక్టులు, స్పోర్ట్స్ అకాడమీలు, మోటివేషనల్ టాక్స్ ద్వారా యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, టెన్నిస్‌లో తన అనుభవాన్ని పంచుకోవడానికి టీవీ షోలు, కామెంటరీ, స్పోర్ట్స్ అనాలిసిస్ లాంటి కొత్త ఛాలెంజ్‌లను స్వీకరిస్తుంది. రాబిన్ ఊతప్ప వంటి స్నేహితులతో కలిసి ఉండడం, కుటుంబంతో సమయం గడపడం ఆమె ప్రెజర్ఫ్రీ లైఫ్‌ను ఎంజాయ్ చేయడంలో సహాయపడుతున్నాయి. అభిమానులు ఆమె తర్వాతి అడుగులు ఏమిటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.