
యాంకర్ సుమ… ఇన్నాళ్లు బుల్లితెరపై పలు రియాల్టీ షోలతో సందడి చేసిన సుమ.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సుమ సరికొత్త షో స్టార్ట్ చేసింది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె పేరుతో అడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హోస్ట్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇందులో కమెడియన్ జీవన్ జడ్జిగా వ్యవహరించనున్నారు. మార్చి 6 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. తొలి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్, అంబటి అర్జున్, పృథ్వీ, విష్ణు ప్రియ, సుప్రీత, దీపిక, యాదమ్మరాజులతో పాటు ఇద్దరు యూట్యూబ్ స్టార్స్ పాల్గొన్నారు. ఇక ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్ , పంచులతో అదరగొట్టింది సుమ. ఈ స్టార్స్ చేసిన వంటను రుచి చూసేందుకు జడ్జిగా వచ్చిన జీవన్ ఇబ్బంది పడిన విధానం చూస్తుంటే పడి పడి నవ్వాల్సిందే. మొత్తంగా చెఫ్ కుకింగ్ మంత్ర ప్రోమో అదిరిపోయింది.
తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 6న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రానున్నట్లు మేకర్స్ తెలిపింది. ఇంతకీ చెఫ్ మంత్ర ప్రోమో మీరు చూశారా..? అయితే ఇప్పుడు చూసేయండి.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..