
ప్రతి వ్యక్తి జీవితంలో మంచి, చెడు సమయాలు ఉంటాయి. మంచి సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని అనుభవిస్తారు. చెడు సమయాల్లో కష్టాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పేదరికంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిల్లో ఇంట్లో సంపదను పెంచే అనేక చర్యల గురించి వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి వాటిల్లో ఒకటి ఇంట్లో కొన్ని వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. వీటిని ఇంట్లో ఖాళీగా ఉంచితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. సంపదల దేవత లక్ష్మిదేవి ఆగ్రహం చెందుతుంది. అప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
ఆహార ధాన్యాలు
ఇంట్లో ఆహార ధాన్యం నిల్వ ఎల్లప్పుడూ ఉండాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో బియ్యం నిల్వ చేసే పాత్ర ఎన్నడూ ఖాళీగా ఉండకూడదు. ఇంట్లో ఆహార ధాన్యం నిల్వలో కొరత ఏర్పడితే దానిని వెంటనే తిరిగి నింపాలి. ఆహార ధాన్యాలు నిండుగా ఉన్న ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి.
బాత్రూంలో ఖాళీ బకెట్
ఇంట్లో బాత్రూంలో ఉంచిన బకెట్ ఎల్లప్పుడూ నిండి ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. బాత్రూంలో బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూలత ఖాళీ బకెట్ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఇంట్లో సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో బాత్రూంలో ఉన్న బకెట్ ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండాలి. అలాగే విరిగిన బకెట్‌ను ఉపయోగించకూడదు.
ఇవి కూడా చదవండి
పూజా మందిరంలో పంచ పాత్ర
పూజ గదిలో పెట్టుకునే పంచ పాత్ర లేదా.. నీరు పెట్టుకునే పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. పూజ తర్వాత ఆ పాత్రను ఎల్లప్పుడూ నీటితో నింపాలి. పూజ గదిలోని నీటిలో గంగా జలం , తులసి దళాలను కూడా జోడించాలి. దేవుడు దాహం వేసినప్పుడు ఆ నీటిని తాగుతాడని నమ్ముతారు. పూజ గదిలో పంచ పాత్ర ఖాళీగా ఉంచితే.. అది ఇంట్లో ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది.
డబ్బులు పెట్టుకునే బాక్స్ లేదా సేఫ్
ఇంట్లో ఉన్న సేఫ్ కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఎంత అవసరం వచ్చినా సేఫ్ లో కనీసం కొంత డబ్బు అయినా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బులను పెట్టే బాక్స్ ఖాళీ చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో పేదరికంతో ఇబ్బంది పడేలా చేస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.