
Afghanistan vs Australia, 10th Match, Group B: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పదవ మ్యాచ్ నేడు ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ క్రికెట్ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘానిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ చేయనుంది.. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ ఒక దానిలో విజయం, ఒక దానిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇరుజట్ల మధ్య మొత్తం 4 వన్డేలు జరిగాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా గెలిచింది. అయితే, డార్క్ హార్స్ అనే ట్యాగ్‌తో వచ్చే ఆఫ్ఘన్ జట్టును తేలికగా తీసుకోవడం కష్టమే. ఆఫ్ఘాన్ జట్టు తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించేలా చేసింది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ బి నుంచి సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడిపోతే, అది టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది, అయితే కంగారూ జట్టు ఓడిపోతే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడవలసి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఇరు జట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (wk), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..