
హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 1న శనివారం యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనుంది. నిపుణా & సేవా ఇంటర్నేషనల్ సహకారంతో ఈ మెగా జాబ్ ఫెయిర్ కార్యక్రమాన్ని జేఎన్టీయూ నిర్వహిస్తోంది.. పదో తరగతి మొదలు పట్టభద్రుల వరకు అన్ని రంగాలకు చెందిన ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ను ఒక్క చోటకు తీసుకురానున్నారు.. జేఎన్టీయూలో జరిగే మెగా జాబ్ ఫెయిర్ -2025 లో వందకు పైగా కంపెనీలు హాజరుకానున్నాయి.. దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాల ఆఫర్స్‌తో కంపెనీలు రిక్రూట్మెంట్ జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జేఎన్టీయూ మెగా జాబ్ ఫెయిర్‌లో దాదాపు 20 కు పైగా ఐటీ కంపెనీలు, 10కి పైగా ఫార్మా కంపెనీలు, 30 కోర్ కంపెనీలు, 40 కిపైగా బ్యాంక్, రిటైల్, FMCG, మేనేజ్ మెంట్ సంస్థలు పాల్గొంటున్నాయి. పదో తరగతి నుంచి పట్టభద్రుల వరకు నిరుద్యోగులు మెగా జాబ్ ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహాకులు సూచించారు..

Mega Job Fair 2025 At Jntu
మార్చి 1న కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉదయం 10గంటల నుంచి జాబ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఫోటోలోని క్యూఆర్ కోడ్ ద్వారా ఉద్యోగార్థులు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జేఎన్టీయూ వీసీ తెలిపారు

Jntu
ఇటీవల జాబ్ ఫెయిర్ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన వైఛాన్స్లర్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి.. ఈ జాబ్ ఫెయిర్ విద్యార్థులు, ఉద్యోగార్థులకు.. ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ రంగాల్లో విశేష ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఉద్యోగ రంగం మారుతున్న నేపథ్యంలో, నైపుణ్యాల అభివృద్ధి అవసరమైన అంశమని చెప్పారు. ఎందరో ఆశావహులకు ఈ వేదికని సద్వినియోగం చేసుకోవాలని వీసీ కోరారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.