పాకిస్థాన్లో ముస్లిం జనాభా ఎక్కువని అందరికి తెలుసు. అయితే అక్కడ అతి తక్కువ సంఖ్యలో హిందువులు కూడా నివసిస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో తెలిసింది. 1947లో విభజన జరిగినప్పటి నుంచి కొందరు అక్కడే ఉండిపోయారు. అలాంటి వారిలో సంగీత ఒకరు. ఆమె ప్రస్తుతం పాకిస్థాన్లో అత్యంత ధనిక హిందూ మహిళ కూడా. పాకిస్థాన్ అత్యంత సంపన్నుల జాబితాలో హిందువులు కూడా ఉన్నారు. అత్యంత ధనిక హిందువు ‘దీపక్ పెర్వానీ’ అనే ఫ్యాషన్ డిజైనర్ అయితే ధనిక హిందూ మహిళగా ‘సంగీత’ రికార్డ్ సృష్టించింది. వీరిద్దరూ కూడా సినీ రంగానికి చెందినవారు కావడం మరో గొప్ప విషయం. సంగీత పాకిస్థాన్లో ప్రముఖ నటి. ఆమెను ‘పర్వీన్ రిజ్వీ’ అని కూడా పిలుస్తారు. అయితే తన పేరు అక్కడ మతానికి వ్యతి రేకంగా ఉండటం వల్లే పర్వీన్ రిజ్వీగా పేరు మార్చుకున్నారు. విభజనకు ముందు ఇండియాలో జన్మించిన సంగీత హిందూ మహిళగానే పాకిస్థాన్లో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్లో అత్యంత ధనిక మహిళగా రికార్డ్ సృష్టించారు. పర్వీన్ రిజ్వీ నటి మాత్రమే కాదు, దర్శకురాలు కూడా. తన 21 ఏట నుంచి సినీ రంగంలో ఉన్నారు. తక్కువ కాలంలోనే పాపులర్ నటిగా గుర్తింపు పొందారు. ఆమె భారతదేశంతో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉన్నారు. ఈమె దివంగత భారతీయ నటి ‘జియా ఖాన్’కు అత్త. ఆమె ఏడాది సంపాదన సుమారు 39 కోట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛీ.. ఎంతకు తెగిస్తున్నార్రా.. అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ ఫేక్ వీడియో
షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్ !! గౌతమ్ గంభీర్ కు షాక్
వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత
