హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ లో ఇప్పటికే ఈ విమానాల తోక భాగాలను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవలే 250వ యూనిట్‌ను టీఎల్ఎంఏఎల్ నుంచి అమెరికాకు పంపారు. సీ-130జే విమానాలను ఇప్పటివరకు అమెరికాలోని మారీటా యూనిట్లో మాత్రమే లాక్‌హీడ్ మార్టిన్ పూర్తిస్థాయిలో తయారుచేస్తోంది. ఒకవేళ ఐఏఎఫ్తో ఒప్పందం ఖరారైతే ఆ విమానాల తయారీ కోసం భారత్‌లో ప్రత్యేకంగా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తమకు హైదరాబాద్‌లో టీఎల్ఎంఏఎల్ ఉన్నందున.. అందులోనే ఈ భారీ విమానాలను తయారు చేస్తారని లాక్‌హీడ్ మార్టిన్ వర్గాలు తెలిపాయి.
మరిన్ని వీడియోల కోసం :
