
Lahore Qalandars vs Multan Sultans, PSL 2025: పీఎల్ఎల్ (PSL) 2025లో భాగంగా 12వ మ్యాచ్ ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ముల్తాన్ జట్టుకు చెందిన యాసిర్ ఖాన్ 44 బంతుల్లో 87 పరుగులతో సత్తా చాటాడు. ఇది కాకుండా, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 17 బంతుల్లో 32 పరుగులు, ఉస్మాన్ ఖాన్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించారు. చివరి ఓవర్లలో ఇఫ్తికార్ అహ్మద్ కేవలం 17 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లాహోర్ ఖలందర్స్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్‌ను చిత్తుగా కొట్టేయడం. తన 3 ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అది ఒక రికార్డుగా మారింది.
హారిస్ రవూఫ్ చెత్త రికార్డ్..
లాహోర్ ఖలందర్స్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ తన మూడు ఓవర్లలో 18.00 సగటుతో 54 పరుగులు ఇచ్చాడు. ఇది అతని టీ20 కెరీర్లో అత్యధిక ఎకానమీ రేటు. ఇందులో ఫోర్లు, సిక్సర్ల నుంచి 46 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్లో అతని ప్రదర్శన గురించి చెప్పాలంటే, అతను 4 మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ కాలంలో, అతను 146 పరుగులు సమర్పించుకున్నాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇప్పటివరకు 61 మ్యాచ్‌లు ఆడి, 69 వికెట్లు పడగొట్టాడు హారిస్ రవూఫ్. హారిస్ రవూఫ్ తన వేగంతో ప్రత్యర్థులకు షాకిస్తుంటాడు.
ఇవి కూడా చదవండి
ఈ సీజన్లో ముల్తాన్ తొలి విజయం..
ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ తొలి విజయాన్ని సాధించింది. ఆ జట్టు లాహోర్ ఖలందర్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికి ముందు, ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ విజయం కొంత ఊరటనిచ్చింది. కాగా, లాహోర్ ఖలందర్స్ 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది.
పాయింట్ల పట్టిక విషయానికొస్తే, లాహోర్ ఖలందర్స్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో మూడవ స్థానంలో ఉంది. కాగా, ముల్తాన్ సుల్తాన్స్ 4 మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..