

కాటేరమ్మ కొడుకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఈ సలారోడు మాత్రం వస్తే పాతుకుపోతాడు. ఫామ్ కోల్పోవడం అన్న మాటుండదు. బరిలోకి దిగితే ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోవాల్సిందే. మరి మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారా.? అతడు మరెవరో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్.
ఐపీఎల్ 2025లో గుజరాత్ వరుస విజయాలు సాధిస్తోందంటే.. దానికి మూలకారణం సాయి సుదర్శన్. ఓపెనర్‌గా దిగి మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. తన జట్టుకు అద్భుత విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మరో ఆర్ద సెంచరీతో అదరగొట్టాడు. ఇప్పటిదాకా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 6 మ్యాచ్‌లు గెలిచి.. కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
74, 63, 49, 5, 82, 56, 36, 52.. సుదర్శన్ ఈ సీజన్లో మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడి.. 417 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 82గా ఉంది. అలాగే ఈ ఇన్నింగ్స్‌లలో మొత్తంగా 42 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మిగిలిన డొమెస్టిక్ ఆటగాళ్ల కంటే సుదర్శన్ మిస్టర్ కన్సిస్టెంట్గా ఐపీఎల్లో కొనసాగుతున్నాడని మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. కచ్చితంగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ సాయి సుదర్శన్‌ను ఎంపిక చేయాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.