
Mohit Ahlawat: క్రికెట్ అంటే ప్రతిరోజూ ఏవో రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. కొన్ని రికార్డులు బద్దలవుతుంటాయి. ఈ జెంటిల్మెన్ గేమ్‌లో ఆటగాళ్ళు తమ బలమైన ప్రదర్శనతో తమ జట్లకు విజయాలు అందిస్తూ, తమ ఖాతాలో పలు రికార్డులు లిఖించుకుంటారు. వీటిలో కొన్ని ఇప్పటికీ అసాధ్యంగానే ఉన్నాయి. అయితే, కొందరు ప్లేయర్లు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మైదానంలో సత్తా చాటుతుంటారు. వీరిలో కొందరు మాత్రమే వెలుగులోకి వస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే క్రికెటర్ కూడా అసాధారణ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్స్ కూడా ఊహించలేని ఘనతను సాధించిన ఈ భారత క్రికెటర్.. కెరీర్లో మాత్రం విఫలమయ్యాడు.
చరిత్ర సృష్టించిన మోహిత్ అహ్లవత్..
20 ఓవర్ల క్రికెట్లో సెంచరీ చేయడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా గొప్ప విషయం. ఈ ఫార్మాట్లో ఒక ఆటగాడి బ్యాట్ నుంచి వందకు పైగా పరుగులు రావడం చాలా అరుదు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా సెంచరీలు చేసిన ఆటగాళ్ల సంఖ్య చాలా తక్కువగానే కనిపిస్తుంది. అందుకే ఈ ఫార్మాట్లో డబుల్, ట్రిపుల్ సెంచరీ గురించి ఆలోచించడం కూడా ఓ జోక్‌లా అనిపిస్తుంది. కానీ, భారత్ నుంచి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అసాధ్యమైన దానిని సాధించి ఔరా అనిపించాడు.
బౌలర్లకు బ్లడ్ బాత్..
Scorecard of Delhi’s Mohit Ahlawat’s 300 runs in a T20 match. @mohanstatsman pic.twitter.com/RM2AbldY4S
— Umang Pabari (@UPStatsman) February 7, 2017
29 ఏళ్ల మోహిత్ అహ్లావత్.. ఫిబ్రవరి 7, 2017న, ఢిల్లీలో మావి XI వర్సెస్ ఫ్రెండ్స్ XI జట్ల మధ్య స్థానిక క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఓ మ్యాచ్ జరిగింది. దీనిలో అహ్లామత్ బౌలర్లను ఊచకోత కోశాడు. మావి XI తరపున ఆడుతూ, మైదానంలో శివతాండవం చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన మోహిత్ అహ్లావత్.. 39 సిక్సర్లు, 14 ఫోర్లతో బౌలర్ల బెండ్ తీశాడు. మోహిత్ అహ్లవత్ కేవలం 21 సంవత్సరాల వయసులో టీ20 క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు.
టీం ఇండియాలో దక్కిన చోటు..
ఫ్రెండ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్ లో మోహిత్ అహ్లవత్ 72 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. దీని కారణంగా మావి ఎలెవన్ 20 ఓవర్లలో 416 పరుగులు చేయగలిగింది. దీనికి సమాధానంగా, ఫ్రెండ్స్ స్కోరు బోర్డులో 200 పరుగులు నమోదు చేసింది. దీంతో 216 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. మోహిత్ అహ్లవత్ దేశీయ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడితే, అతను ప్రస్తుతం సర్వీసెస్ జట్టు తరపున ఆడుతున్నాడు. కానీ, దీనికి ముందు అతను ఢిల్లీ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు. అతను 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 386 పరుగులు చేశాడు. అయితే, 31 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 836 పరుగులు చేశాడు. అలాగే, 22 టీ20 మ్యాచ్‌ల్లో 492 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..