

ఇండస్ట్రీలో చాలా మంది చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాగే ఇంకొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కంటున్నారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ భామ 24 ఏళ్లకు పెళ్లి చేసుకుంది.. తర్వాత 27 ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..? సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?
నటి విద్యా మాల్వాడే. హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తుంది. టెలివిజన్ రంగంలో కూడా పనిచేస్తుంది. ఈ ముద్దుగుమ్మ 1973 మార్చి 2న ముంబైలో జన్మించింది. విద్యా మాల్వాడే తన నటనా ప్రస్థానాన్ని 2003లో “ఇంటెగ్రల్” అనే ఆంగ్ల చిత్రంతో ప్రారంభించింది. ఈ చిన్నదానికి 2007లో విడుదలైన “చక్ దే! ఇండియా” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ విద్యా శర్మ పాత్రను పోషించింది. షారుఖ్ ఖాన్ సరసన నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. విద్యా మాల్వాడే ముంబైలో పెరిగింది, తన విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేసింది. ఈ బ్యూటీ మోడలింగ్ రంగంలో కూడా కొంతకాలం పనిచేసింది . అలాగే ఎయిర్ హోస్టెస్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. సినిమాల్లోకి రాకముందు ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఆమె మొదటి భర్త, కెప్టెన్ అరవింద్ సింగ్ బఘేలా, 2000లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు. ఈ సంఘటన తర్వాత ఆమె నటన రంగంలోకి అడుగుపెట్టి, తన కెరీర్‌ను నిర్మించుకుంది.
“చక్ దే! ఇండియా” తర్వాత విద్యా మాల్వాడే “కిడ్నప్”, “టుమారీ సులు”, “మీర్జాపూర్”వంటి పలు ప్రాజెక్టుల్లో నటించింది. ఆమె బాలీవుడ్లోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా తన నటనా సత్తాను చూపించింది. “మీర్జాపూర్”లో ఆమె షబ్నమ్ ఖాన్ పాత్రలో కనిపించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే, “మజా మా” (2022) వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించింది. ఈ బ్యూటీ క్రేజీ ఫోటోలు సోషల్ మీడియా లో పంచుకుంటుంది. ఆమె 2009లో సంజయ్ దయామాను వివాహం చేసుకుంది, అతను స్క్రీన్ రైటర్ , ఫిల్మ్‌మేకర్. విద్యా మాల్వాడే తన సహజమైన నటన, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో భారతీయ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
View this post on Instagram
విద్యా మాల్వాడే..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.