
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో సీఎం రేవంత్‌ను తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం కలిసి, స్టాలిన్ తరఫున ఈ ఆహ్వానం అందించింది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో ఈ నెల 22న స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలతో పాటు ఎన్డీయే కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు, ఏ కూటమిలో లేని తటస్థ పార్టీలకు కూడా స్టాలిన్ ఆహ్వానాలు పంపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.