ఈ క్రమంలోనే ఈ మూవీ బుల్లితెరపై రికార్డ్ క్రియేట్ చేసిందని.. ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు ఈ మూవీ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్. ముందుగా ఈ వేడుకలో మాట్లాడిన ఆదిశేషగిరి రావు.. తనకు నిర్మాతలిద్దరితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు.పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందన్నారు. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రీరిలీజ్‌తో నిర్మాతలు సంతోషంగా ఉంటున్నారని.. ఖలేజాకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఇక నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా రీ రిలీస్ అవుతున్న సందర్భంగా కనకరత్న మూవీస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో ఈ సినిమాను చాలా కష్టపడి తీసినట్లు చెప్పారు ఈ మూవీ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్. సినిమాలో ప్రతీ సీన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. సినిమాలో త్రివిక్రమ్, మహేష్ బాబు, నమ్రత అందరూ ఒక టీంలా పనిచేశారన్నారు. ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించిన సినిమా ఖలేజా అని సీ కళ్యాణ్ చెప్పారు. అయినా ఇప్పటికి యూత్ ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
14 ఏళ్ల తర్వాత అవార్డ్స్.. అల్లు అర్జునే తొలి విజేత
