
హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. మణికొండలోని పాషాకాలనీలో G+2 ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. దీంతో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనమయ్యారు.. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.. పాషాకాలనీలో ఉన్న G+2 ఇంట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.. ఆ మంటలు వేగంగా ఫస్ట్‌ఫ్లోర్‌కి వ్యాపించాయి.. దట్టమైన పొగ.. మంటలతో.. ఇంట్లోనే బాధితులు చిక్కుకున్నారు.. ఊపిరాడక ముగ్గురు కూడా అక్కడే కుప్పకూలారు.. రెస్క్యూ చేసి కాపాడేలోపే ముగ్గురూ మృతి చెందినట్లు కాలనీ వాసులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం వెంటనే అక్కడికి చేరుకుంది.. సిబ్బంది మంటలను అదుపు చేయడంతోపాటు.. ఇంట్లో చిక్కుకున్న పలువురిని స్థానికుల సహాయంతో కాపాడారు. భవనం పైనుంచి తాళ్ల సహాయంతో పలువురిని రెస్క్యూ చేశారు.. అయితే.. భవనంలో షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..